visitors

Tuesday, December 20, 2011

ప్రతిభకు పురస్కారం!!

92 సంవత్సరాల వయసులో సంగీతరావుగారిలోని కళాతపస్వికి లభించబోతున్న మరొక గౌరవం" టాగూర్ పురస్కారం."

మద్రాసులో కూచిపూడి అకాడెమీ స్థాపించి, కూచిపూడి నృత్యనాటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని, ప్రజాబాహుళ్యంలో నాట్యానికే ఒక గొప్ప ప్రచారాన్ని కలిగించిన వారు  కళా ప్రపూర్ణ డా. వెంపటి చినసత్యం. 
1973 సం. ప్రాంతాలలో ఆ సంస్థలో ప్రవేశించి దాదాపు 35 సంవత్సరాలపాటు వెంపటి చిన సత్యంగారు రూపొందించిన నృత్యనాటకాలకు విశిష్టమైన సంగీతాన్ని అందించారు పట్రాయని సంగీతరావుగారు. 
 ఫోటోలో ఉన్నవారు- ఎడమనుంచి -శ్రీమతి కనకదుర్గ(గాత్రం), శ్రీ గోవిందరాజన్(మృదంగం), శ్రీ ఎం.ఎస్.రావు(వయొలిన్), శ్రీ సంగీతరావు, శ్రీ వెంపటి చినసత్యం, శ్రీ నాగరాజన్(ఫ్లూట్)

 కూచిపూడి అకాడెమీ  రూపొందించిన పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం, రుక్మిణీ కల్యాణం, హరధనుర్భంగం (రామాయణం), శ్రీ పదపారిజాతం(అన్నమయ్య) మొదలైన దాదాపు పదిహేను నృత్యనాటకాలకు సంగీత సహకారాన్ని అందించిన పట్రాయని సంగీతరావుగారి విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర సంగీత నాటక అకాడెమీ – అకాడెమీ  టాగూర్ పురస్కార్ 2011 అనే అవార్డుతో సత్కరించనున్నట్టు ప్రకటించింది.

రవీంద్రనాథ టాగూర్ జయంతి ఉత్సవాలు (నూటయాభై సంవత్సరాలు) సందర్భంగా  ఈ అవార్డును లలితకళారంగంలో విశిష్టమైన ప్రతిభ ప్రదర్శించిన కళాకారులు వందమందికి ఈ గౌరవాన్ని ప్రకటించారు. వీరిలో 50 మంది కళాకారులను టాగూర్ రత్న అనే అవార్డుతోను( రూ. 3 లక్షలు బహుమతి) , మరొక 50 మంది కళాకారులను టాగూర్ పురస్కార్ అనే అవార్డుతోను(రూ.1 లక్ష బహుమతి) సత్కరిస్తారని అకాడెమీ తన ప్రకటనలో తెలిపింది.

ఈసందర్భంగా శ్రీ పట్రాయని సంగీతరావుగారికి కళాభివందనాలు.

11 comments:

sampat said...

An honour well deserved!! We are all thrilled to hear the news!! Please convey our regards to Sangeeta Rao garu.

Sampat, Subhadra.

Ayapilla Sastry said...

మేము అందరము టాగూర్ పురస్కార విషయం తెలుసుకొని చాలా ఆనందించాము. మా అందరితరపున సంగీతం బావ-అక్కయ్యలకు శుభాకాంక్షలు మరియు నమస్కారములు.

ఇట్లు,
ఆయపిళ్ళ శాస్త్రి మరియు కుటుంబము - బొబ్బిలి

www.apuroopam.blogspot.com said...

శ్రీ సంగీత రావు గారికి లభించిన ఈ గౌరవానికి ఆయన ఆన్ని విధాలా అర్హులు. కూచిపూడి నృత్య సంగీత రూపకాలకు ఆయన సంగీతం సమకూర్చిన తీరు సంగీతజ్ఞుల మన్ననలనుబడసింది. వారికి నా శుభాకాంక్షలు.

Viswanatham Kollur said...

A well deserved award though quite late to Sri Sangeetha Rao garu.Congratulations !!

Anonymous said...

Hearty congrats. Highly deserved. The authorities woke up at last!

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

Sreenivas Paruchuri said...

Hearty congratulations to Sangitarao gaaru for this deserved recognition! Regards, Sreenivas

Anonymous said...

శ్రీ సంగీతరావుగారికి సంగీత నాటక అకాడమీవారి టాగూర్ అకాడమి పురస్కార్ లభించడం చాలా సంతోషంగా వుంది. అకాడమి పురస్కారం అన్నది సామాన్యమైన విషయం కాదు. అటువంటి అరుదైన పురస్కారం మన శ్రీ సంగీతరావు గారిని వెతుక్కుంటూ రావడం మన కుటుంబాలకి అందరికీ గర్వకారణం.
ఇంత వయసులో కూడా కూడా ఆయన అసామాన్యమైన ఞాపకశక్తితొ తన అనుభవాలనీ తీపి గుర్తులనీ మనతో పంచుకుంటున్నప్పుడల్లా నా మనసెంతో సంతోషంతో నిండిపోతుంది. ఆయనలో ఒక మంచి రచయితా కవీ ఒక గాయకుడూ కూడా వున్నారు. ఇన్ని గుణగణాలు ఒక్క వ్యక్తిలో పొందికగా అమరడం ఆ భగవంతుడిచ్చిన వరం.
భగవంతుడు శ్రీమతి మరియు శ్రీ సంగీతరావు గార్లకి ఆయురారోగ్యాలని ప్రసాదించి, శ్రీ సంగీతరావుగారికి ఇంకా మరెన్నో ఇలాంటి అవార్డులు రావాలని ఆశిస్తున్నాను.

కె.కోటీశ్వరరావు

KOLLURU KAMESWARA RAO said...

శ్రీ పట్రాయని సంగీతరావుగారి సేవలను ఇన్నాళ్ళకు కేంద్ర సంగీత నాటక అకాడెమి వారు గుర్తించి టాగోర్ పురస్కారం 2011 పేరుతో అవార్డు లభించినందుకు చాలా సంతోషంగా వుంది.ఇది మనందరికీ మరియు మన తరవాతి తరం వారికీ ఎంతో గర్వకారణంగా ఉంటుందనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనుకుంటాను.ఈ సందర్భంగా వారికీ వారి కుటుంబ సభ్యులకు మా అందరి శుభాకాంక్షలు.
కొల్లూరు కామేశ్వర రావు

కమనీయం said...

Ihave already posted in my blog about this rare honour to sri Sangeetarao garu .congratulations again!

buddhamurali said...

అభినందనలు

Unknown said...

ఆలస్యం గా నయినా ఈ విషయం తెలుసుకుని అభినందనలు తెలియ చేస్తున్నాను . సంతోషం