సాహిత్యాభిలాషి అయినవాడు నన్నయ్య, తిక్కన, పోతన మొదలైన మహాకవుల కావ్యాలు,
షేక్స్పియర్, మిల్టన్ లాంటి మహారచయితల ఇంగ్లీష్ సాహిత్యం చదివి, BA, MA పట్టాలు పొందినా పొందక పోయినా తనదైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సృజనాత్మకమైన
రచనలు చేస్తాడు.
అదే చిత్రలేఖనం అధ్యయనం చేసిన విద్యార్ధి గొప్ప గొప్ప చిత్రకారుల
పధ్ధతులను నేర్చుకున్నా, తన ప్రత్యేకతను చాటే చిత్రాల ద్వారా తన ప్రతిభ
గుర్తింపబడాలని కోరుకుంటాడు.
అలాగే మరే కళలకి సంబంధించిన వారైనా, శిల్పం కానీ ఇంకేదైనా తమదైన శైలి
ప్రకటించుకునే ప్రయత్నం చేస్తారు.
కాని శాస్త్రీయ సంగీతాన్ని త్యాగరాజు, దీక్షితార్, శ్యామాశాస్త్రి, వగైరా
కృతుల ద్వారా అభ్యాసం చేసి విద్వాంసులనిపించుకున్న వారు కూడా తమ వ్యక్తిత్వాన్ని,
ప్రత్యేకతను, స్మృజనాత్మకతను
ప్రదర్శించగలిగే నైపుణ్యాన్ని ఎందువల్ల సాధించ లేకుండా ఉన్నారు? మనోధర్మం సృజనాత్మకతని ఎంత వరకు పోషిస్తుంది?
ఈ విషయంలో సినిమా సంగీత దర్శకులు మరింత ప్రతిభ కనపరుస్తున్నారు కదా.
హిందుస్తానీ సంగీతంలో ఈ పరిస్థితి ఇంతకన్నాఏమైనా మెరుగ్గా ఉందా?
శాస్త్రీయ సంగీతంలో సృజనాత్మకత గురించి ప్రముఖ సంగీతవేత్త కలైమామణి పట్రాయని సంగీతరావుగారి అభిప్రాయాలు.............త్వరలో ఇక్కడే.
1 comment:
ఈనాటి సినీసంగీతదర్శకుల ప్రతిభ గురించి ఎంత తక్కువగా ప్రస్తావిస్తే అంత మంచిది!
Post a Comment