అమరగాయకుడు శ్రీ ఘంటసాలగారి భగవద్గీత గానానికి నాన్నగారు శ్రీ పట్రాయని
సంగీతరావుగారు 2008 జనవరిలో చేసిన ఈ రాగవిశ్లేషణను మిత్రులు శ్రీ నూకల
ప్రభాకర్ గారి సహకారంతో ఆడియో రూపంలో నిక్షిప్తం చేసాం.
నవంబర్ 2, 2025 న నాన్నగారి 105వ జన్మదినం సందర్భంగా ఈ ఆడియోను
సం'గీతా'భిలాషులతో పంచుకుంటున్నాం.
ఈ ఆడియో 58 భాగాలుగా విభజించబడింది. రోజుకు ఒక భాగం చొప్పున 58 భాగాలను
వినిపించాలని ఉద్దేశ్యం. మరిన్ని విశేషాలు ఆడియోలో వినగలరు.
ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఉపయోగించిన రాగాలననుసరించి ఆయన గానం చేసిన,
లేదా ఆయన స్వరపరచిన వివిధ సినీ గీతాలను కూడా ఈ ఆడియో భాగాలలో పొేందుపఱచడం
జరిగిెంది. అయితే ఆయా రాగాలు రసభావములకనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోను
ఇతర రాగముల ఛాయా స్వరములతోను కూడా అవి పరిగ్రహించడం జరిగింది. 88 ఏళ్ళ
వయసులో ఈ రికార్డింగ్ జరిగిననాటి నాన్నగారి గాత్ర అభ్యంతరాలను రసజ్ఞులైన
శ్రోతలు సహృదయంతో గ్రహించగలరు.
Ghantasala Bhagavadgita San'gita'amrutham - Raagarasasphoorthi - a
clarification
ఘంటసాల సం'గీతా'మృతం - రాగరసస్ఫూర్తి - ఒక స్పష్టీకరణ
This critical analysis is intended to initiate the younger generation into
the field of classical music and the choice of Sri Ghantasala's
Bhagavadgita is incidental as it happens to be a repository of vareity
of raagas suitable for the purpose of serious study of application of
Carnatic and Hindusthani raagas to various situations and moods. The
reasearch author was closely associated and involved in the original
creation and intended this research work to help the practitioners,
amateurs and connoisseurs alike in appreciating the intricacies of the
raagas dealt therein. The reproduction of the rendition of Sri
Ghantasala's Bhagavadgita slokas is solely for the purpose of
appreciating the similarities and dissimilarities in the raagas applied
in his work and other contemporary music
పట్రాయని వేణు గోపాలకృష్ణ

No comments:
Post a Comment