visitors

Sunday, April 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఆరవ భాగం

11.04.2021 - ఆదివారం భాగం - 26:
అధ్యాయం 2  భాగం 25 ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.

శ్వేత కపోతాలు

మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. 

ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. 

ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  
నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.

పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

1960ల తర్వాత ఎప్పుడో ఒక ఉగాది ఘంటసాల మాస్టారింట్లోనే జరిగింది. శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారు (జరుక్ శాస్త్రి) సాహితీలోకానికి చిరపరిచితులు. యామిజాలవారు మా నాన్నగారికి చిరకాల మిత్రులు. సాలూరుకు సమీపంలోని శివరామపురాగ్రహారం వారి స్వస్థలం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిదీ అదే ఊరు. పద్మనాభస్వామిగారు ఉద్యోగరీత్యా మద్రాస్ లో స్థిరపడ్డారు. పానగల్ పార్క్ వద్దనున్న శ్రీరామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు లో తెలుగు పండితులుగా పనిచేసేవారు. 

శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చెల్లెలు మల్లాది మంగతాయారుగారు కూడా అదే స్కూల్ లో మరో తెలుగు టీచర్ గా పనిచేసేవారు. మా చెల్లెళ్ళు, మాస్టారి ఆడపిల్లలు అందరూ యామిజాలవారికి, మంగతాయారుగారి విద్యార్ధినులే. మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి రమణమ్మకి పిహెచ్.డి. చెయ్యాలన్నంత అభిమానం తెలుగు భాష మీద కలగడానికి వీరిద్దరి వద్ద చేసిన శిష్యరికమే కారణమని  నేను అనుకుంటున్నాను. శారదా విద్యాలయలో శ్రీ పద్మనాభస్వామిగారు మాత్రమే మగవారు. మిగిలిన టీచర్లంతా హెడ్మాష్టర్ తో సహా అందరూ మహిళలే. 

యామిజాల వారు మొదట నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గర బజుల్లా రోడ్ కి అవతల తిలక్ స్ట్రీట్ లోను తరవాత  కోడంబాక్కం రైల్వేస్టేషన్ వెళ్ళేదారిలో రామకృష్ణ స్ట్రీట్ ముందుండే వివేకానందా స్ట్రీట్ మొగలో ఉన్న ఇంట్లో ఉండేవారు. యామిజాల వారు చాలా సన్నగా పొడుగ్గా వుండేవారు. మాట కూడా చాలా నెమ్మది. వినీ వినిపించకుండా వుండేది. యామిజాల మాస్టారి భార్య భానుమతి గారు(?) ముగ్గురో నలుగురో మగపిల్లలు. ఆడపిల్లలు లేకపోవడం వలన ఆడపిల్లలంటే ఆ దంపతులు మహా ముచ్చట పడేవారు. మహాశ్రోత్రీయ కుటుంబం. వారింటి పూజాగృహంలో రమణమహర్షి, కావ్యకంఠ గణపతిముని గార్ల చిత్రపటాలు వుండేవి. యామిజాల మాస్టారు మా ఇంటి ప్రక్కనుండే స్కూల్ కు నడచి వెళ్ళేవారు. ఖద్దర్ పంచెకట్టు, మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉండే జుబ్బా, దానికి ఒక్క పెన్ను మాత్రం పట్టేపాటి సన్నటి పొడుగు జేబు, భుజంపై కండువా - నిజంగా పూర్వకాలపు ఉపాధ్యాయుడికి ప్రతీకగా వుండేవారు. మాటా నెమ్మది, మనిషి చాలా సౌమ్యుడు. ఈయనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించే వ్యక్తి జరుక్ శాస్త్రి అనబడే జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు. పానగల్ పార్క్ కు ఉత్తరంవేపు యామిజాల వారైతే, దక్షిణం వేపు జలసూత్రం వారు. బహుశా, ఉస్మాన్ రోడ్ లో రామన్స్ కాఫీ పొడి కొట్టు, సలామ్ స్టోర్స్ వెనకవేపు వుండే ఇళ్ళలో వుండేవారనుకుంటాను. అక్కడే జి.ఎన్.స్వామిగారి కుటుంబమూ ఉండేది. టి.నగర్ బస్ స్టాండ్ నుంచి బయల్దేరిన బస్సులు ఆగే మొదటి బస్ స్టాప్ కూడా అక్కడే ఉండేది.

సాయంత్రం ఐదు ఆరు ప్రాంతాలలో  జలసూత్రంవారు, శ్రీరంగం నారాయణబాబుగారు, యామిజాలవారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, ఆరుద్రగారి వంటి కవిపుంగవులంతా పానగల్ పార్క్ ముందున్న సిమెంట్ చప్టాల మీద ఆసీనులై లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అందరూ సాహితీవేత్తలే కావడం వలన  ఎన్నో ఆసక్తికరమైన విషయలే చర్చించబడేవి. కీట్స్, కృష్ణశాస్త్రి, కిన్నెరసాని, కోడంబాక్కం అప్పలసరసలు, చర్చిల్ చుట్టలు, గిరీశం లెక్చెర్లు, యిలా ఎంతోమంది వారి మాటల్లో కనిపించి పలకరించేవారు. ఈ సాహితీవేత్తల మాటలను వినడానికనే కొంతమంది సాహితీ పిపాసులు శ్రోతలుగా అక్కడికి చేరేవారు. మా నాన్నగారికి కూడా మంచి సాహిత్యాభిలాషవుండడం వల్ల వీరందరితో మంచి సాన్నిహిత్యమే వుండేది. ఆయనకు అవకాశమున్నప్పుడల్లా వీరిని కలుసుకునేవారు. 

శ్రీరంగం నారాయణబాబు
వీరిలో నారాయణ బాబుగారి వేషధారణ మిగతావారికి భిన్నంగా వుండేది. మధ్యపాపిడి, టైట్ పైజమా షేర్వాణి, పొడుగాటి జుబ్బా, పైన వేస్ట్ కోట్.
'యామిజాల జాలమేమి
జాలమేమి యామిజాల'
అంటూ పద్మనాభస్వామిగారి గురించిన రైమ్ ఒకటి వినపడేది. ఆ మాటను ఎవరు ఎప్పుడు ఎందుకు ఉపయోగించారనే విషయం నాకు తెలియదు.

జలసూత్రంవారు మహాభారతాన్ని, యామిజాలవారు రామాయణాన్ని ఆంధ్రీకరిస్తున్న రోజులవి. ఆంధ్రప్రభ దిన పత్రికలో మహాభారతం, ఆంధ్రపత్రిక దినపత్రిక లో రామాయణం ధారావాహికగా ప్రచురించబడేవి. రామాయణ, మహాభారత గ్రంథాల పుస్తకరూప ఆవిష్కరణోత్సవాన్ని ఘంటసాల మాస్టారు చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా నాన్నగారు కూడా ఇతోధికంగా తోడ్పడ్డారు. ఒక ఉగాదినాటి ఉదయం ఈ కృతిస్వీకారోత్సవం ఘంటసాల మాస్టారింటి హాలులో జరిగింది. ఆ కృతులభర్త ఘంటసాల మాస్టారేనని గుర్తు. ఖచ్చితంగా చెప్పలేను. మా నాన్నగారికి గుర్తుండి ఉండవచ్చు. ఆనాటి ఉత్సవానికి సర్వశ్రీ - దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, పాలగుమ్మి పద్మరాజుగారి వంటి కవులు ప్రత్యేకంగా విచ్చేసారు. ఆహ్వానితులందరికీ ముందుగా, పార్క్ ల్యాండ్స్ హోటల్ నుండి తెప్పించిన అల్పాహారం తో చిన్నపాటి విందు జరిగింది. తర్వాత, కవిసమ్మేళనంలో భాగంగా యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు తాము ఆంధ్రీకరించిన  రామాయణ, మహాభారతాలనుండి కొన్ని ఘట్టాలను రసవత్తరంగా చదివి వినిపించారు. వక్తల ప్రసంగాల తర్వాత ఘంటసాల మాస్టారు ఈ ఇద్దరు కవులను సముచితరీతిని గౌరవించి సత్కరించారు.  

ఘంటసాల యామిజాల మధ్యలో జలసూత్రం దేవులపల్లి

ఆనాటి కార్యక్రమం ప్రముఖ కవుల రాకతో కళకళలాడింది. మాస్టారు, మా నాన్నగారు ఒక మంచి సత్కార్యంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందించారు.

మరికొన్నేళ్ళ తర్వాత, శ్రీ యామిజాల పద్మనాభస్వామిగారు శ్రీ తిరుపతి వేంకటేశ్వరుడిమీద వ్రాసిన 'భువన మోహన' పద్యాన్ని, 'శ్రీశేషశైలేశ శ్రితపారిజాతా' అనే పాటను ఘంటసాల మాస్టారు గ్రామఫోన్ రికార్డ్ గా రిలీజ్ చేసారు.

ఈ విధంగా ఘంటసాల మాస్టారు సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల పట్ల కూడా మంచి ఆసక్తికనపర్చేవారు.

ఇలాగే మరొకసారి, ఒక యోగాచార్యుడు మాస్టారి వద్దకు వచ్చి మద్రాస్ లో తన యోగాసనాల కార్యక్రమాన్ని సినీ ప్రముఖులందరి ఎదుటా ఏర్పాటు చేయమని కోరారు. సినీమాలోకంలో ఇలాటి యోగా కార్యక్రమాలు ఏమాత్రపు గుర్తింపు, మన్నన పొందుతాయో తెలియని సందిగ్దావస్థలోనే మాస్టారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరం  వృత్తి వ్యాపకాలతో తీవ్రమైన ఒత్తిళ్ళకు గురి అవుతున్న సినీ కళాకారులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించి ప్రతీరోజు కొంతసేపు యోగాసానాలు వేస్తూంటే ఆరోగ్యానికి ఎంతైనా మంచిదని సందేశమిస్తూ ఘంటసాల మాస్టారు పరిశ్రమలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రికలను నేను, నరసింగరావు కలసి సినీ ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి ఇవ్వడం అందరినీ ఆహ్వానించాం. ఈ యోగాసానాల కార్యక్రమాన్ని ఘంటసాల మాస్టారు హబిబుల్లా రోడ్ లో వున్న రామారావు కళామండపంలో విజయవంతంగా నిర్వహించారు.

1970లకు ముందు మద్రాసులో తెలుగు సాంస్కృతిక సంఘాలు చాలా తక్కువ సంఖ్యలోనే వుండేవి. చెన్నపురి ఆంధ్ర మహాసభ, పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రా సోషల్ & కల్చురల్ క్లబ్ - ఇలా తెలుగు సంస్థలు వ్రేళ్ళమీదే లెఖ్ఖపెట్టవచ్చును. ఆయా సంస్థలు కూడా ఏడాదికి ఒకటో రెండో ఉగాది, సంక్రాంతి లాటి పర్వదినాలలో ఉత్సవాలు జరిపేవారు.

ఆరోజుల్లో మద్రాస్ లో తమిళ రంగస్థల నాటకాలకు వుండే మోజు, గిరాకీ సినీమాలకు కూడా వుండేది కాదు. తమిళ సినీ నటులు కూడా తమ పాప్యులారిటీని రంగస్థలం మీదనుండి పెంచుకున్నవారే. శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, చో, నాగేష్, తంగవేలు, ఎమ్.ఆర్.రాధ, సహస్రనామం, మనోరమ వంటి నటులంతా కూడా సినీమాలలో నటిస్తూనే  తరచూ నాటకాల ప్రదర్శనలిచ్చేవారు. లెజెండరీ డైరక్టర్ అయిన బాలచందర్, వృత్తిపరంగా గవర్నమెంట్ ఉద్యోగి అయినా రంగస్థల నాటకాల ద్వారా మంచి పేరు పొందారు.  టెలివిజన్ ఇళ్ళలోకి ప్రవేశించనంతకాలం తమిళనాట నాటకాలదే రాజ్యం.  తమిళ సీనీ నటీనటులతో పోలిస్తే తెలుగు రంగస్థల అభివృద్ధికి సినీనటులు చేయగలిగింది ఎంతో కొంత ఉన్నా చేసింది ఏమీ లేదనే చెప్పాలి. 

1965 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. వాటిలో అజరామర గీతాలుగా వన్నెకెక్కినవి - పెండ్యాలగారి 'కొండగాలి తిరిగింది'( ఉయ్యాల జంపాల); నమో భూతనాధా (సత్య హరిశ్చంద్ర); ఎస్.పి.కోదండపాణిగారి 'ఆలయాన వెలసిన, బొమ్మను చేసి ప్రాణం పోసి( దేవత).

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి పాండవ వనవాసం. మరొకటి సిఐడి.

ఈ చిత్రాల గురించి వచ్చేవారం....

కొసమెరుపు :
ఇది 1960 లకు ముందే జరిగినది.

ఘంటసాల మాస్టారు కచేరీలకోసం బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఎక్కువగా రైల్లోనే వెళ్ళేవారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ వెళ్ళి సాగనంపడనికి పెద్దబాబు, నేను, మాకు (తోడుగా బాబు వాళ్ళ అమ్మగారు - సావిత్రమ్మగారు) వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు ఇతర ఆర్కెష్ట్రాతో ముందే వెళ్ళిపోయేవారు. ఒకసారి హౌరామెయిల్ లో ప్రయాణం. ఆ రోజుల్లో  హౌరామెయిల్ రాత్రి 8.30 కు  4వ నెంబర్ ప్లాట్ఫారమ్ మీదనుండే బయల్దేరేది. మాస్టారు ఫస్ట్ క్లాసులో; ఆర్కెష్ట్రావారు స్లీపర్ కోచ్ లో ప్రయాణం. ఆరోజుల్లో రిజర్వడ్ కంపార్ట్మెంట్స్ లిమిటెడ్ గా ఉండేవి. అందుచేత వెళ్ళిన ప్రతీసారి రిజర్వేషన్ దొరక్కపోతే జనరల్ భోగీలోనే వెళ్ళవలసి వచ్చేది. మాస్టారు స్టేషన్ కు వెళ్ళగానే బృంద సభ్యులున్న చోటికి వెళ్ళి వారిని పలకరించి తన కంపార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. 

ఆ రోజు మాస్టారు కొంచెం ముందే స్టేషన్ కు చేరుకున్నారు. బయట పనుల ఒత్తిడివల్ల ఎప్పుడూ ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతోనే స్టేషన్ కు వెళ్ళడం జరిగేది. మేమూ వెంట పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఓ పది నిముషాలు ముందే చేరుకున్నాము. మాస్టారితోపాటూ మేమూ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాము. ఎదురు సీట్ లో ఎవరో ఇద్దరు యూరోపియన్స్ భార్యాభర్తలు కూర్చొనివున్నారు. మాకు అర్ధంకాని ఇంగ్లీషు స్లాంగ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంక ఒకటి రెండు నిముషాలలో రైలు బయల్దేరబోతున్నదనగా ఆ దొరసాని ఆ దొరగారిని గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టడం మొదలెట్టింది. Farewell kiss. ఆ దొర మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లున్నాడు. నాకూ, పెద్దబాబుకు బ్రహ్మాండమైన షాక్. కళ్ళు పెద్దవి చేసుకొని నోరెళ్ళబెట్టుకు చూస్తున్నాం. మాస్టారు మమ్మల్ని చూసి నవ్వుతు "టైమవుతోంది, ఇంక క్రిందకు దిగండని" అమ్మగారితో చెప్పి వెంటనే మమ్మల్ని క్రిందికి దింపించేసారు. ఆ సీన్ అక్కడితో కట్. అరవై ఏళ్ళ క్రితం బహిరంగ స్థలాలలో ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుధ్ధం. విదేశీయులకు వారి కల్చర్ లో భాగం. వారు అశ్లీలంగా భావించరు. ఈనాడు మన యువతమీద విదేశీ నాగరికతా ప్రభావం  మెట్రోలలోని పబ్లిక్ పార్క్ ల్లో, సినీమా హాల్స్ లో వారి హావభావచేష్టల

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.

శ్వేత కపోతాలు
మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. 

ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. 

ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  
నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.

పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 
        ...సశేషం

Sunday, April 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఐదవ భాగం

04.04.2021 -  ఆదివారం భాగం - 25:
అధ్యాయం 2 భాగం 24  ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1964 లో తెలుగు సినీమా ఖ్యాతిని ఇనుమడింప జేసిన సినీమాలెన్నో వచ్చాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఆత్మబలం, గుడిగంటలు, మూగమనసులు, అమరశిల్పి జక్కన్న, రాముడు భీముడు, డా.చక్రవర్తి, దాగుడుమూతలు, బొబ్బిలియుద్ధం మొదలైన సినీమాలు ఆర్ధికంగా ఘనవిజయం పొందాయి. ఈ సినీమాలన్నిటి విజయానికి సంగీతం,  ఘంటసాల గారు పాడిన పాటలే ఎంతో దోహదం చేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ అన్ని టివి ఛానల్స్ లో, సినీమా పాటల వేదికల మీద విస్తృతంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పాటల సజీవత్వానికి ఘంటసాల మాస్టారి అసాధారణ గానమాధుర్యమే కారణమని నా నిశ్చితాభిప్రాయం.

ఇక, ఘంటసాల మాస్టారు ఆ ఏడాది సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే -  గుడిగంటలు, మర్మయోగి, శ్రీ సత్యనారాయణ మహత్యం, వారసత్వం  - నాలుగూ ఎన్.టి.రామారావు కధానాయకుడిగా నటించినవే. రెండు సాంఘికం, ఒకటి జానపదం, ఒకటి పౌరాణికం. ఈ నాలుగు సినీమాలకు ఘంటసాల మాస్టారు మర్చిపోలేని సంగీతాన్నే అందించారు. 

ఈ నాలుగు సినీమాల విషయంలో నాకు తెలిసిన విషయాలు అనుభవాలు ఈ వారం తెలియజేస్తాను. 

మర్మయోగి సినీమా తమిళం రీమేక్. 1951 లో జూపిటర్ పిక్చర్స్ తీసిన ఈ సినీమా ఘన విజయం సాధించడమేకాక ఎమ్.జి.ఆర్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆకాలంలో కత్తియుద్ధాలకు ఎమ్జీయార్ పెట్టింది పేరు. అదే సినిమాను అదే జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగులో ఎన్టీఆర్ తో అదే మర్మయోగి పేరుతో తీశారు. ఈ సినీమాలో రామారావు కొన్ని సీన్లలో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపిస్తారు. ఈ సినీమాకు సంబంధించినంతవరకు ఈ సినిమా లోని కధానాయకుడు ఎన్.టి.ఆర్. కథానాయిక కృష్ణకుమారిలకు  స్వరపర్చిన పాటలకంటే ఉపపాత్రలకోసం చేసిన పాటలు సన్నివేశపరంగా మంచి జనాదరణ పొందాయేమో అనిపిస్తుంది. లీలావతి (పి.లీల), గుమ్మడి (మాస్టారి నవ్వులు) కలసి నటించిన పడవ పాట 'నవ్వులనదిలో పువ్వుల పడవ' పాట, మరో ఉపపాత్ర లంక సత్యం కోసం మాస్టారు పాడిన పద్యాలు, ఆ తర్వాత కొందరు నర్తకీ మణులు (కోమల, జమునారాణి) పాడిన 'ఎందుకు పిలచితివో రాజా!' పాట చాలా హాయినికలిగిస్తాయి. 

ఈ చిత్రంలో జమునారాణి ఏకంగా నాలుగు పాటలు, అందులో మాస్టారితో మూడు డ్యూయెట్లు పాడడం ఒక విశేషమే. ఆవిడ nasal voice ఒక ప్రత్యేక ఆకర్షణగా  అభిమానించే రసికులెందరో వున్నారు.  

జానపదచిత్రం కావడాన కావలసినన్ని యుద్ధాలు, ఛేసింగ్స్, ఘోస్ట్  చేసే అట్టహాసాలు చూడడానికి ఉత్సాహం కలిగిస్తాయి. రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. సినీమా స్లోగా, డ్రాగీగా నాకు అనిపించింది. కానీ, ఒక్కొక్క సీన్ మీద మాస్టారు కంపోజ్ చేసిన బిట్స్ చూశాక నా అభిప్రాయమే మారిపోయింది. ఓపెనింగ్ సీన్సలోని ఆటలు, పోరాటాలు, మధ్య మధ్యలో హార్స్ ఛేసింగ్స్ వాటిమీద ఉపయోగించిన ట్రంపెట్స్, సాక్సోఫోన్, వైలిన్స్, ప్లూట్, క్లారినెట్, కాంగో, బేస్ డ్రమ్స్ ల ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఉత్సాహం రేకెత్తిస్తాయి.

ఈ సినీమాలో  మరో ముఖ్య ఆకర్షణ రాజుగారి దెయ్యం. మధ్య మధ్యలో వచ్చి వ్యాంప్  రాణి (లీలావతి)ని భయపెడుతూంటుంది. ఆ సీన్ లో రంపం, వైలిన్ బౌతో సృష్టించిన ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఆ దెయ్యం చేసే కొన్ని ధ్వనులను తబలా ప్రసాద్ వినిపించాడు. అతని గొంతు దగ్గర పికప్ లు పెట్టి రికార్డ్ చేయడం బాగా గుర్తుంది. 

రక్తసంబంధం తర్వాత రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా నిర్మించిన చిత్రం గుడిగంటలు. ఇదికూడా తర్జుమా చిత్రమే. శివాజీ నటించిన 'ఆలయమణి' ని గుడిగంటలుగా ఎన్టీఆర్ తో నిర్మించారు. ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని ఆరు పాటల్లో రెండు మాత్రమే మాస్టారి స్వయంప్రతిభను చాటే పాటలు. మిగిలిన నాలుగు తమిళం, హిందీ పాటల వరసలే. అయినా అవి కూడా తెలుగుదనం సంతరించుకునేలా స్వరపర్చడంలో మాస్టారి నైపుణ్యం కనిపిస్తుంది. పాటలన్నీ బహుళ జనాదరణ పొందాయి. 

టైటిల్ మ్యూజిక్ మీద షెహనాయ్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలు ప్రాధాన్యత వహించాయి. చిత్రం ప్రారంభం నుండి టెన్నిస్ మ్యాచ్ మీద వచ్చే రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళాను. ఎక్కువ పాళ్ళలో మెలోడ్రామా గల చిత్రం గుడిగంటలు. శివాజీ , ఎన్టీఆర్ నటించిన ఈ కథ హిందీలో (ఆద్మీ) దిలీప్ కుమార్ నటించడం ఆశ్చర్యమే. శివాజీ గణేశన్  హెవీడోస్ నటనకు, దిలీప్ కుమార్  సున్నితమైన ముఖభావాలకు పొంతనే కుదరదు. ఈ చిత్రంలో మాస్టారు పాడిన మూడు సోలోలు ఈనాటికీ అందరూ విని ఆనందిస్తున్నారు.

లాహిరి లాహిరి పాట తర్వాత మరోసారి నేను ఘంటసాల మాస్టారికి తీరని  ద్రోహం చేసాను. అది బొబ్బిలి కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నప్పుడు. కాలేజీ ఏనివర్శరీ ఫంక్షన్స్ లో కొంతమంది మిత్రద్రోహులు నన్ను అడగాపెట్టకుండా  పాటలు పాడేవారి లిస్ట్ లో నాపేరు వేయించారు. నా పేరు మైక్ లో ఎనౌన్స్ చేసే వేళకు నేను ఆ చుట్టుపక్కలే లేను. ఎక్కడో వున్న నన్ను బలవంతంగా స్టేజిమీదకు తోసారు. అసలే భసాపంకం. మా ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గట్టిగా పద్యాలు చదవడం తప్ప పాడడమనేదే లేదు. స్టేజి మీద అంతమంది లెక్చరర్ లు, స్టూడెంట్ల మధ్య ఏం పాడాలి? ఎవరి పాట పాడాలి. ఆ సమయంలో ఆ వూళ్ళో ఆడుతున్న 'గుడిగంటలు' లో పాట గుర్తుకు వచ్చింది. ఆ పాటలో  ప్రముఖ రచయితల కథానాయికల పేర్లు ఉపయోగించారు కవి దాశరధి. అప్పట్లో ఆ పాట పూర్తిగా గుర్తుండేది.  వెంటనే నా బాణీలో ఆ పాటను పాడేసాను. లేదా, చదివేసాను. మా బొబ్బిలి యువరాజా వారితో సహా అక్కడున్నవారంతా చాలా సహృదయులు.  నాకూ చప్పట్లు కొట్టారు. 'నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో'  పాటను ఎంతో భావయుక్తంగా  స్వరపర్చి, అద్భుతంగా గానం చేసిన ఘంటసాల మాస్టారికి గానం పేరిట  నాలాటివారెందరు అన్యాయం చేస్తున్నారో కదా!

పొడుగాటి గజిబిజి బిజిఎమ్స్ తో అసలు పాట పల్లవేదో మర్చిపోయేలా పాటల కంపోజింగ్ ఘంటసాల మాస్టారి శైలికాదు.  పాటలోని భావానికి తగినట్లుగా అవసరంమేరకు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అందుకు అవసరమైన వాద్యాలను మాత్రమే ఉపయోగించడం, తాను పాడి, తోటి గాయకులచేత పాడించి కావలసిన రసభావాన్ని సృష్టించడమే మాస్టారి బాణీ. 

హెవీ ఆర్కెష్ట్రా హోరు, జోరు వల్లే పాట రక్తికడుతుందని అనుకునేవారికి పూర్తి వ్యతిరేకం ఘంటసాల బాణి. వారి పాటలన్నింటిలో గాయకులకే ప్రాధాన్యత. ఏ గాయకుడి రేంజ్ ఎంతవరకు, ఎవరెవరు ఏయే పాటలు పాడగలరన్నది ఆయనకు తెలిసినంత సుస్పష్టంగా ఇతర సంగీత దర్శకులకు తెలియదనే చెప్పాలి. అలాటి సున్నితమైన, శ్రావ్యమైన, లాలిత్యంతోకూడిన మంచి పాటలు గల చిత్రం 'వారసత్వం'. ఈ సినీమాకు ముందు అనుకున్న పేరు 'మమకారం'. ఆర్ధిక ఇబ్బందులవల్ల సినీమా నిర్మాణం దాదాపు మూడేళ్ళు సాగింది. సినీమా చేతులు మారి 'వారసత్వం' గా విడుదలయింది. వారసత్వంలో ఘంటసాల మాస్టారు, సుశీల ఆలపించిన 'ప్రేయసీ మనోహరి వరించి చేరవే', సుశీల పాడిన 'పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు', మాస్టారు, పి.లీల పాడిన 'చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ' పాటలు అపాతమధురాలుగా, అజరామర గీతాలుగా అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంతో శ్రావ్యమైనవి. 

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1964 లో విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'శ్రీ సత్యనారాయణ మహత్యం'. దాదాపు ఇరవై పాటలు, పద్యాలు గల సంగీత రసభరిత చిత్రం. ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి దర్పణం పట్టే చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినీమాలో మాస్టారి తో పాటూ సుశీల, లీల, కోమల, స్వర్ణలత, వసంత, మాధవపెద్ది, రాఘవులు ఉన్న పాటలన్నింటిని పాడారు. 

1964 నాటికి ఘంటసాల సంగీతకుటుంబంలో మరో గాయకుడు వచ్చి చేరాడు. అతనే మొవ్వ జనార్దనరావు. బాగానే పాడేవాడు. కానీ అదృష్టం కలసిరాలేదు. మాస్టారి దగ్గరే వుంటూ కోరస్ లు పాడడం, మాస్టారి కంపోజింగ్ లకు రావడం, ఆయనతో రికార్డింగ్ లకు, కచేరీలకు వెళ్ళడం చేసేవాడు. మనిషి చాలా సౌమ్యుడు. సున్నితమైనవాడు. మాతో స్నేహపూర్వకంగా మెసిలేవాడు. ఈ సినీమా కోరస్ లలో మొవ్వ జనార్ధనరావు కూడా ఇతరులతో పాడాడు. ఘంటసాలవారి సంగీత కుటుంబంలో మరో ద్వయం - జనార్దన ద్వయం. ఇద్దరి ఇనిషియల్స్ 'ఎమ్' తోనే ఆరంభమౌతాయి. మిట్ట, మొవ్వ. మిట్టా జనార్దన్ సుప్రసిద్ద సితార్ విద్వాంసుడు. మొవ్వ జనార్దన రావు గాయకుడు. ఈ ఇద్దరితో పరిచయం పెరగనప్పుడు వీరిద్దరిలో ఎవరు జనా‌ర్దన్ , ఎవరు  జనార్దనరావు అనే తికమక చాలా రోజులుండేది.

ఈ సినీమా టైటిల్స్ మీద 'జయ జయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ నారాయణా' అనే దశావతార గీతం. ఈ పాటను రాగమాలికలో కంపోజ్ చేశారు మాస్టారు. ఈ పాట విషయంలో మాస్టారు ఒక కొత్తపోకడ పోయారనే అనుకుంటున్నాను. నేను అంతకుముందు ఏ పాటల్లోనూ అలాటి స్వర రచన వినలేదు. ఘంటసాల మాస్టారు, పి.లీల, బృందం పాడిన  ఈ పాట లో ఎక్కడా నేపథ్య వాద్య సంగీతం వినపడదు, లయ ప్రధాన వాద్యాలు తప్ప. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించవలసిన చోట్లలో మాస్టారు బృందగాయకుల గాత్రాలనే ఉపయోగించారు. స్వరాలు, ఛాయాస్వరాలను ఆయా గాయకులు ఆలపిస్తుండగా ప్రధాన పాటను మాస్టారు, లీల పాడారు. ఇదొక వైవిధ్యమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. 

ఈ సినిమాలో మరో డ్యూయెట్ మాస్టారు, సుశీల పాడిన 'జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే, జలతారు మెరుపు నీవే' పాట. ఈ పాట కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్ కు అనారోగ్యం కారణంగా మా నాన్నగారు పూర్తిగా హాజరు కాలేదు. ఈ పాట ఆయన లేకుండానే జరిగింది. నేను ఆ పాట సమయంలో వుండడం మూలాన ఆ పాట ట్యూన్ ఎలా చేశారో మా నాన్నగారు నన్ను వినిపించమనేవారు. నేను కొంచెం అటుయిటుగా పాడి వినిపించేవాడిని. సినీమాలో ఈపాట నాయికా నాయకుల మధ్య సాగే యుగళగీతమే అయినా శృంగారభావాలేవీ ధ్వనించవు. నాయిక నాయకుని పరంగా ఆలపిస్తుంది. కానీ, నాయకుడు నాయికను తలచుకోవడానికి బదులుగా దైవాన్ని తల్చుకుంటూ పాడడం తరచూ మనం చూసే సినీమాలలో కనపడదు. మరి ఈ నావెల్టీని ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు.

ఈ సినీమాలో మాస్టారు పాడిన 'మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా' అనే పాట ఈ చిత్రానికే హైలైట్. ఘూర్జరీతోడి (శుభపంతువరాళి) రాగంలో కంపోజ్ చేశారు. మాస్టారు మూడు శృతిలో ఈ పాటను పాడారని చెప్పగా విన్నాను. పాట క్లైమాక్స్ లో మాస్టారి రెండిషన్ చాలా హైపిచ్ లో ఉంటుంది. ఈ పాట రికార్డింగ్ డేట్ ఫిక్సయి రికార్డింగ్ థియేటర్ కూడా బుక్ చేయడం జరిగింది. వాహిని స్టూడియో అనే గుర్తు. 

సరిగ్గా రికార్డింగ్ రోజున ఘంటసాల మాస్టారికి హై ఫీవర్. పైగా ముఖంమీద సెగగడ్డలు లేవడంతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా సావిత్రమ్మగారికి కలిగింది. కానీ, ఘంటసాల మాస్టారు ఆ సలహాకు సుముఖత చూపలేదు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే నిర్మాత చాలా నష్టపోతాడని ఆయన ఆవేదన. పైగా ఈ పాట షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లుంది. ఎన్.టి.రామారావుగారితో షెడ్యూల్. ఈ అవకాశం కోల్పోతే మరల రామారావుగారి డేట్స్ కుదరడం కష్టం. ఈ విధంగా నిర్మాత సాధకబాధకాలన్నీ ఆలోచించి, తన అనారోగ్యాన్ని లక్ష్యపెట్టకుండా రికార్డింగ్ కు వెళ్ళడానికే నిశ్చయించారు. మంచో చెడ్డో ఆ సత్యనారాయణస్వామే చూసుకుంటాడని స్టూడియోకు బయల్దేరారు. ముఖం మీది సెగగెడ్డలకు మంచి గంధం పూతపెట్టుకొని జ్వరంతోనే వెళ్ళారు. మాస్టారు ధియేటర్ కు వెళ్ళే సమయానికి మా నాన్నగారు,  పాట నొటేషన్స్ ను, బిజిఎమ్ నొటేషన్స్ ను ఆర్కెష్ట్రా వారందరికీ చెప్పడం వారంతా వారి వారి బిట్స్ రాసుకోవడం అయింది. ఈ పాటలో ఎక్కువగా షెహనాయ్, వైలిన్స్, సెల్లో, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా వాద్యాలు వినిపిస్తాయి. ఘంటసాల మాస్టారు వచ్చి సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి ఆర్కెష్ట్రా వారు వాయించిన పాట విన్నారు. ఎవరికి ఇవ్వవలసిన సూచనలు వారికిచ్చి వాయిస్ తో ఒక మానిటర్ చూద్దామని తన మైక్ వద్దకు వెళ్ళారు. ఆనాటి ఆయన పరిస్థితిని చూసినవారంతా నిర్మాతతో సహా, జాలిపడి ఆరోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందనే భావించారు. కానీ మాస్టారు ఒప్పుకోలేదు. మాస్టారికి ఏవిధమైన ఒత్తిడి తేకుండా అతి భక్తి శ్రద్ధలతో ఆర్కెష్ట్రా వారు జాగ్రత్తగా వాయించడం మొదలెట్టారు. ఇప్పటి రికార్డింగ్ సిస్టంకి, ఆనాటి విధానానికి హస్తిమశకాంతం తేడా. ఆనాడు ట్రాక్ సిస్టమ్ అంత అభివృద్ధి చెందలేదు. లైవ్ రికార్డింగ్ చేయడానికే అందరు సంగీతదర్శకులు పాటుపడేవారు. ఒక పాట రికార్డింగ్ అనేది ఒక సమిష్టి కృషి. ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. అనేక విభాగాల సాంకేతిక నిపుణులంతా కలసి పనిచేస్తేనే ఒక పాట బయటకు వస్తుంది. ఆరోజు అందరికీ ఒకటే ఆలోచన. ఘంటసాలగారిని ఎక్కువ శ్రమ పెట్టకుండా పాట పూర్తిచేయాలి. ఆర్కెష్ట్రాతో వాయిస్ మానిటర్ చూశారు.  మాస్టారు వెంటనే
రెడీ ఫర్ టేక్ అన్నారు. ధియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలన్స్. పస్ట్ టేక్ ప్రారంభమయింది. ఘంటసాల మాస్టారిలో ఏ దైవం ఆవహించిందో తెలియదు. తన జ్వరం, సెగగడ్డల బాధ అన్నీ మర్చిపోయారు. ఆ మూడు శృతిపాటను అద్భుతంగా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా పాడారు. పాట క్లైమాక్స్ లో 'మాధవా ! కేశవా' అంటూ బాధతో తదాత్మ్యం చెంది పెట్టిన కేకతో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లింది. ఏదో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందేమోననే అందరూ భయపడ్డారు. కానీ ఏమీ జరగలేదు. మాస్టారిలోని భావావేశానికి ఆర్కెష్ట్రాతో సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. షెహనాయ్ సత్యం అయితే బొటబొటా కన్నీరే కార్చారు. ఇక సెకెండ్ టేక్ కు అవసరమే లేకపోయింది. అందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్. అనుకున్న సమయానికి రికార్డింగ్ పూర్తి అయింది. ఎన్టీఆర్ తో షూటింగ్ పూర్తి అయింది. ఇది నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన. అందుకే సంగీతం దైవదత్తమని, ఘంటసాల మాస్టారు దైవాంశసంభూతుడని మనస్ఫూర్తిగా నమ్ముతాను.

ఈ సినీమా పూర్తికాకుండానే ఈ సినీమాను డైరక్ట్ చేస్తున్న ఎస్ రజనీకాంత్ మరణించారు. మిగిలిన సినీమాను ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కె. గోపాలరావు పూర్తిచేశారు. చిత్రాన్ని రజనీకాంత్ గారికి అంకితమిస్తూ డైరెక్టర్ గా ఆయన పేరే వేశారు.

ఘంటసాల మాస్టారి సినీ జీవితచరిత్రలో ఇలాటి మరచిపోలేని ఘట్టాలెన్నో! నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. 

రామచంద్రరావు. ఇంటిపేరు దేవగుప్తాపు. విశాఖపట్నం జిల్లావాడు. సొంతవూరు ఏదో నాకు గుర్తులేదు. ఘంటసాలవారి చిరకాలమిత్రుడు. సావిత్రమ్మగారికంటే ముందునుంచి సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి. రామచంద్రరావు, ఘంటసాలగారిని కలపి మైత్రీబంధం పెంచినది పానగల్ పార్క్ అరుగులే. ఇద్దరూ జీవనోపాధి వెతుక్కుంటూ మెడ్రాస్ చేరినవారే. అష్టకష్టాలు పడినవారే. ఎప్పుడైతే ఘంటసాలగారికి గాయకుడిగా పేరు రావడం ప్రారంభమయిందో అప్పటినుండే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి తగిన ఆదాయము రావడం ప్రారంభించింది. అటువంటి సమయంలో పార్క్ స్నేహితుడిని వదిలేసి ఘంటసాలవారు తన దారి తాను చూసుకోలేదు. ఆ మిత్రుడిని కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. మాస్టారు, రామచంద్రరావు కలసి మోతీలాల్ స్ట్రీట్, రామానుజం స్ట్రీట్ లలో అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేశారు.  సావిత్రమ్మగారు మొట్టమొదటిసారిగా మద్రాసు కాపరానికి వచ్చినప్పుడు తోడుగావుండి తీసుకువచ్చినది ఈ రామచంద్రరావేనట. చిన్న వయసులోనున్న సావిత్రమ్మగారికి దగ్గరుండి వంటావార్పు నేర్పింది కూడా ఈ రామచంద్రరావే. ఘంటసాల వారి కుటుంబానికి చాలా ఆత్మబంధువు. ఒక్క ఘంటసాలగారిని తప్ప మిగిలిన వారందరినీ ఏకవచనప్రయోగమే. మాస్టారిని మాత్రం గౌరవంగా అయ్యగారు అని పిలిచేవారు. అంతటి ఆత్మీయంగా మెలిగిన కారణంచేతనే ఘంటసాల మాస్టారు తన స్వగృహప్రవేశం సమయంలో తన మిత్రుడైన రామచంద్రరావుకు దగ్గరుండి ఘనంగా ఉపనయనం జరిపించారు. ఆ విషయాలు గతంలో నెం.35, ఉస్మాన్ రోడ్ లో చోటుచేసుకున్నాయి.

నెం. 35, ఉస్మాన్ రోడ్ ఒక పుష్పక విమానంలాటిది. ఎంతమంది వచ్చినా మరొక్కరికి చోటు వుంటూనే వుండేది. మేస్టారింటి మేడమీద ఎంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయో. వారంతా నాకన్నా వయసులో బాగా పెద్ద. మా నాన్నగారికంటే వయసులో చిన్నయినా నాకు వారెవరూ సమవయస్కులు కారు. అయినా అందరూ ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ రామచంద్రరావు మా అమ్మగారిని అక్కయ్యగారని పిలిచేవారు.

మనిషి సన్నగా, చామనఛాయతో, పక్కపాపిడి క్రాఫింగ్ తో ఎప్పుడూ ప్యాంట్,  ఫుల్ హ్యాండ్ షర్ట్ తో మహానీటుగా వుండేవారు. చేతిరుమాలులో పౌడర్ వేసుకొని ఆ రుమాలును మెడ వెనకనుండి ముందుకు చుట్టుకోవడం ఫస్ట్ ఫస్ట్ రామచంద్రరావు దగ్గరే చూశాను. ముందు రెండు పళ్ళు కొంచెం ఎత్తుగానే వుండేవి. చైన్ స్మోకర్. ఇంట్లో కాల్చేవారు కారు. కానీ మేడమీద రోడ్లమీద వెళుతున్నప్పుడు చాలా సిగరెట్లే కాల్చేవారు. ఘంటసాల మాస్టారి సినీమా నిర్మాణ వ్యవహారాలలో ఏమాత్రం పాత్ర వహించారో నాకు అంతగా గుర్తులేదు, కానీ, మద్రాస్ హార్బర్ లో ఏదో ఉద్యోగం చేసేవారు. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాటాక ఇంటికి చేరేవారు. హార్బర్ నుండి అప్పుడప్పుడు ఏవో ఫారిన్  వస్తువులు, తినుబండారాలు తెచ్చేవారు. మాస్టారింట్లోనే భోజనవసతులన్నీ. అలాటి రామచంద్రరావుకు ఏదో అనారోగ్యం ఏర్పడింది. తరచూ దగ్గుతూవుండేవారు. అయినా సిగరెట్లు మానలేదు. డాక్టర్లు పరిక్ష చేసి చూసి క్షయ అని నిర్ధారించారు.  విశ్రాంతి కోసమని కొన్నాళ్ళ తర్వాత హార్బర్ ఉద్యోగం మానేశారు. మైలాపూర్ లజ్ కార్నర్ లో ఏదో ఒక కాఫీ హోటల్ లో గల్లాపెట్టి దగ్గర కూర్చొనే ఉద్యోగం చేశారు. అదీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తోడుగా ఊరినుండి అతని మేనల్లుడో, అన్నకొడుకో ఒక అబ్బాయి వచ్చి మాస్టారింట్లోనే గడిపాడు. చివరకు వ్యాధి ముదిరి, పిల్లలున్న ఇంట్లో గడపడం శ్రేయస్కరం కాదని విశాఖపట్నం కెజిహెచ్ లో చేరారు. అలాటి గడ్డు పరిస్థితులలో కూడా ఘంటసాల మాస్టారు తన మిత్రుడిని ఆర్ధికంగా ఆదుకున్నారు. ప్రతీ నెల రామచంద్రరావుకు కొంత పైకాన్ని మనీఆర్డర్ ద్వారా పంపేవారు. చిన్నవయసు కావడం వలన కొన్ని విషయాలు అర్ధమయి కాకుండా వుండేవి.

ఒకసారెప్పుడో మా అమ్మగారితో మా పిల్లలం అందరం బొబ్బిలి వెళుతున్నప్పుడు మాకు వాల్టేర్ స్టేషన్ లో  చాలా దీనస్థితిలో కనిపించారు. మా అమ్మగారి దగ్గర కష్టసుఖాలు చెప్పుకున్నారు.

ఈలోగా రైలు కదిలింది. కానీ రామచంద్రరావు క్రిందికి దిగలేదు. నాకు ఒకటే కంగారు, ఎలా దిగగలడని. లేపోతే అతను కూడా మాతో బొబ్బిలి వస్తున్నారా అని తెలియదు. కానీ ఆయన మాత్రం మా అమ్మగారితో కబుర్లు చెపుతునే వున్నారు. ఆ రైలు విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి తిరిగి వాల్టేర్ వచ్చేక రామచంద్రరావు క్రిందికి దిగారు. ఆయనకు మా అమ్మగారు కొంత డబ్బు ఇవ్వడం చూశాను. ఆ పైకం తీసుకుంటున్నప్పుడు రామంచంద్రరావు కళ్ళలో నీళ్ళు చూసి నాకు చాలా బాధ కలిగించింది. 

ఆ రోజుల్లో చాలా రైళ్ళు వాల్టేర్ స్టేషన్ నుండి విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి మళ్ళా వాల్టేర్ స్టేషన్  వచ్చి ఆగి అక్కడనుండి గోపాలపట్నం జంక్షన్ దాకా వచ్చాక మెడ్రాస్ వెళ్ళేవి, హౌరా వెళ్ళేవి, రాయపూర్ వెళ్ళేవి డైవర్ట్ అయ్యేవి.

అదే రామచంద్రరావును ఆఖరిసారిగా చూడడం. ఆ తర్వాత ఎప్పుడో వ్యాధి ముదిరి విశాఖ కెజిహెచ్ లోనే కాలం చేశారని విన్నాను.

రైలు పయనంలాటి ఈ జీవితంలో ఎంతోమంది తారసపడుతూంటారు. కలసి ప్రయాణం చేస్తాం. ఎవరి మజిలీ వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతూంటారు. కొందరిని మరల చూసే అవకాశం వుంటుంది. కొందరి గురించి ఏ విషయాలు తెలియవు. కాలక్రమేణా మనకు ఆప్తులనుకునేవారంతా మనకు తెలియకుండానే మన  జ్ఞాపకాల దొంతరలనుండి కనుమరుగైపోతారు. ఎవరికి ఎంతవరకు ఋణానుబంధమో అంతవరకే ఈ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అన్నీ. ఉన్న నాలుగు రోజులు మంచిగా, అందరితో సఖ్యంగా వుంటూ మంచివాడనిపించుకోవడమే మనం చేయవలసింది. ఈ సూత్రాన్నే ఘంటసాల మాస్టారు తన స్వల్ప జీవితంలో తూ.చ. తప్పక పాటించారని నాకు అనిపిస్తుంది. 

మరిన్ని ఉత్సాహభరిత విశేషాలతో వచ్చే వారం...
...సశేషం